HomeEditor's ChoiceGeneral

సంస్కృతి కాంతి సంక్రాంతి

సంస్కృతి కాంతి సంక్రాంతి

అందాల లోగిళ్ళుఆనందాల పరవళ్ళుఆశల హరివిల్లురంగుల ముంగిళ్ళుగంగిరెద్దుల గంటల చప్పుళ్ళుఆశల్లా ఆకాశంలో ఎగిరే గాలిపటాలుబంతిపూల తోరణాలుకొత్త అల్లుళ్ల సందళ్లు

మెస్సీ హైదరాబాద్ టూర్ తెలంగాణ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది -రేవంత్ రెడ్డి
నమ్మకద్రోహం పెరిగింది ‍- డీజీపీ శివధర్ రెడ్డి
ఆస్ట్రేలియాలో 15 మందిని చంపిన ఉగ్రవాదికి హైదరాబాద్ తో లింక్

అందాల లోగిళ్ళు
ఆనందాల పరవళ్ళు
ఆశల హరివిల్లు
రంగుల ముంగిళ్ళు
గంగిరెద్దుల గంటల చప్పుళ్ళు
ఆశల్లా ఆకాశంలో ఎగిరే గాలిపటాలు
బంతిపూల తోరణాలు
కొత్త అల్లుళ్ల సందళ్లు
హరిదాసు కీర్తనలు
ఎడ్లబండి పోటీలు
గంగిరెద్దుల ఆటలు
మడులను వీడి ఇళ్లను చేరే పంటలు
చెట్లకు కొత్తదనంతో చిగురించే ఆకులు
రంగవల్లికల నడుమ కొలువుదీరే గొబ్బెమ్మలు
భోగి మంటలు
సంతోషం సందడైన సిరుల పండుగ సంక్రాంతి
కలల క్రాంతి సంక్రాంతి
సంస్కృతి కాంతి సంక్రాంతి
సంస్కృతి సంతకం సంక్రాంతి
జీవన క్రాంతి సంక్రాంతి
కళల్లో కాంతి, కల్లాల్లో క్రాంతి సంక్రాంతి.
పట్టణాలు పల్లెకు పయనమయ్యాయి
అనురాగాలు ఎదురొచ్చి ఆహ్వానం పలికాయి
పచ్చదనాన్ని శ్వాసించాలని,
బాంధవ్యాలను ఆస్వాదించాలని ,
ప్రకృతిని సేవించాలని,
కర్పూరంలా తెలియకుండా కరిగిపోయిన
బాల్యాన్ని ప్రేమగా తడుముకోవాలని,
నేలతల్లి కన్నపేగు కు కనకాభిషేకం చేయాలని
పరితపించే పండుగ సంక్రాంతి
సంక్రాంతి అంటే పొలమారిన జ్ఞాపకం
అలలెగిసిన మానస సరోవరం
ప్రకృతి పరంగా పల్లెకు సంక్రమించిన కానుక సంక్రాంతి.

డా. పి విజయకుమార్
అసోసియేట్ ప్రొఫెసర్
తెలుగు శాఖ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి.