HomeTelanganaPolitics

రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్యం:మంత్రి తుమ్మల

రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్యం:మంత్రి తుమ్మల

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానం…. 66 కోట్లతో 2400 ఎకరాలకు సాగునీరు – మంచుకొండ ఎత్తిపోతల పథకం జాతికి అంకితం రైతుల సాగునీటి కల నెరవేరింది –

ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టికి బిట్స్ పీలాని యంగ్ ఆలుమ్ని అవార్డు – 2026
వయసైపోయిందా? … 20 వేలకే బీహార్ అమ్మాయిలు – ‍మంత్రి భర్త‌ వ్యాఖ్యలు
“మీరు హైప్‌లో ఉన్నారు… మేం ప్రజల్లో హోప్ సృష్టిస్తున్నాం”

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానం….

66 కోట్లతో 2400 ఎకరాలకు సాగునీరు – మంచుకొండ ఎత్తిపోతల పథకం జాతికి అంకితం

రైతుల సాగునీటి కల నెరవేరింది – మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభం

ఖమ్మం ప్రతినిధి (నినాదం):
రాష్ట్ర రైతాంగ అభ్యున్నతే లక్ష్యం గా ప్రభుత్వం పనిచేస్తోందని, రానున్న మూడేళ్లలో ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు.మంగళవా రం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, మంచుకొండ ఎత్తిపోతల పథకంను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పోలీస్ కమిషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.అనంతరం మం చుకొండ ప్రాజెక్టు నీటి డెలివరీ సిస్టం వద్ద కృష్ణా జలాలకు పూలతో ఘన స్వాగతం పలికిన మంత్రి, నిర్వహించిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ. గత ఏడాది ఇదే రోజున మంచు కొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తూ ఏడాది లోపే సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేశామని అన్నారు.రఘునాథపాలెం మండ లంలో గిరిజనులు, చిన్న–సన్న కారు రైతులు అధికంగా ఉన్నారని, వారి సాగునీటి ఆకాంక్ష తీర్చేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై లిఫ్ట్ ఏర్పాటు చేసి కృష్ణా జలాలను అందిస్తున్నామని మంత్రి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 300 లిఫ్ట్‌ లు ఏర్పాటు చేశామని, మంచుకొం డ ఎత్తిపోతల పథకం ఎన్‌ఎస్‌పీపై చివరి లిఫ్ట్ అని వివరించారు.ప్ర స్తుతం కృష్ణా జలాలతో చెరువుల ను నింపుతున్నామని, వచ్చే సంవ త్సరం నాటికి సీతారామ ఎత్తిపో తల పథకం పూర్తి చేసి గోదావరి జలాలతో చెరువులను నింపు తామని స్పష్టం చేశారు. బుగ్గవాగు ప్రాజెక్టు పూర్తైతే ఎటువంటి లిఫ్ట్ అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా చెరువులు నింపుతామని తెలిపా రు.వ్యవసాయానికి అవసరమైన గోదాములు, మౌలిక వసతుల కల్ప న పనులు పూర్తి చేస్తున్నా మని, దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి బోనస్ ఇస్తున్నా మని మంత్రి తెలిపారు.రైతులకు యూరియా కొరత లేదని, ధాన్యం కొనుగోలు, విద్యుత్ సరఫరా, సాగు నీటి విషయంలో ఎలాంటి సమస్య లు లేవని భరోసా ఇచ్చారు.రైతు లు లాభసాటి ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని, విదేశా లకు వెళ్తున్న లక్షల కోట్ల రూపాయ లు మన రైతులకే దక్కాలనే ఉద్దే శంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కమిష నర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్ర తినిధులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.