HomeEditor's ChoiceCinema

హీరోయిన్ కృతి శెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు…ఈ వార్తలో నిజానిజాలేంటి ?

ఉప్పెన ఫేమ్, కన్నడ భామ‌ కృతి శెట్టి వివాదాలకు దూరంగా ఉంటారు. ఇంటర్వ్యూలలో కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు తావులేని సమాధానాలు ఇవ్వడానికి ఇష్టపడుతారు. అయితే ఈమె ప్రస్తుతం ఓ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ కృతి శెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు…ఈ వార్తలో నిజానిజాలేంటి ?

ఉప్పెన ఫేమ్, కన్నడ భామ‌ కృతి శెట్టి వివాదాలకు దూరంగా ఉంటారు. ఇంటర్వ్యూలలో కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు తావులేని సమాధానాలు ఇవ్వడానికి ఇష్టపడుతారు. అ

హౌజ్ అరెస్టులు, ఉద్రిక్తతల మధ్య ఎట్టకేలకు బాలు విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య‌
ఐ బొమ్మ రవికి షాక్
అవును నాకు పొగరే…నన్ను చూసుకొని నాకు పొగరు -బాలకృష్ణ‌

ఉప్పెన ఫేమ్, కన్నడ భామ‌ కృతి శెట్టి వివాదాలకు దూరంగా ఉంటారు. ఇంటర్వ్యూలలో కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు తావులేని సమాధానాలు ఇవ్వడానికి ఇష్టపడుతారు. అయితే ఈమె ప్రస్తుతం ఓ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ Tollywood లో ఓ స్టార్ హీరో కొడుకు కృతిశెట్టిని వేధిస్తున్నాడంటూ ఓ రూమర్ దావానంలా వ్యాపించింది.

దీనిపై Krithi Shetty స్పంధించింది. ఈ వార్త నిరాధారమని, ఇదంతా ఓ పుకారు మాత్రమే అని స్పషం చేశారు.

తనను ఓ స్టార్ హీరో కొడుకు వేధిస్తున్నాడని కృతి శెట్టి ఇటీవల కోలీవుడ్ మీడియాలో మాట్లాడినట్టు ఓ వార్త‌ వ్యాపించింది. ఆమె హాజరయ్యే ప్రతి ఈవెంట్, షూట్‌లో ఆ వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నాడని, ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమెతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా ఆ వార్త‌ పేర్కొంది.
”ఇది నిరాధారమైన పుకారు కాబట్టి దీనిని విస్మరించాలని అనుకున్నాను, కానీ ఈ పుకారు పెద్ద ఎత్తున వ్యాపిస్తుండటంతో స్పందించాలని నిర్ణయించుకున్నాను. కథలు వండడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానేయాలి” అని కృతి శెట్టి కోరారు.

తనను ఇబ్బంది పెట్టే స్టార్ హీరో కొడుకునుమీడియా, సోషల్ మీడియానే సృష్టించిందని ఆమె ఆరోపించారు. కాగా, 2022 ప్రారంభంలో విడుదలైన బంగార్రాజు తర్వాత కృతి శెట్టికి నాలుగు డిజాస్టర్లు వచ్చాయి. ఇటీవలే కస్టడీ మూవీలో నాగ చైతన్యతో ఆడిపాడిన ఈ హీరోయిన్ ప్రస్తుతం ‘అజాయంతే రందం మోషణం’ ajayante randam moshanam అనే మలయాళం మూవీలో నటిస్తున్నారు. అలాగే కోలీవుడ్ లో జయం రవి నటిస్తున్న జీని మూవీలో కూడా నటిస్తున్నారు.