---ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమే--- కాంగ్రెస్ అధికారం లో రావడానికి కృషి చేసిన ఇన్నయ్య విడుదలకు రేవంత్ చొరవ చూపాలి.మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
—ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమే
— కాంగ్రెస్ అధికారం లో రావడానికి కృషి చేసిన ఇన్నయ్య విడుదలకు రేవంత్ చొరవ చూపాలి.
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్న ఇన్నయ్య అరెస్ట్ ప్రజాస్వామ్యనికే గొడ్డలిపెట్టని, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు .దాదాపు నాలుగు దశబ్దాలుగా వివిధ ఉద్యమాల్లో క్రియాశీలకంగా వున్న ఇన్నయ్య మలిదశ తెలంగాణ ఉద్యమం ఉదృతం చేయడంలో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం లో ముందున్నారన్నారు.
ప్రజాస్వామ్యయుత పోరాటం తోనే తెలంగాణ సిద్దిస్తుంది అని నమ్మిన ఇన్నయ్య ఆ విధంగానే తన ఆచరణను కొనసాగించారనీ, కానీ మావోయిస్టు ల పేరుతో NIA అధికారులు అరెస్ట్ చేయడం విడ్డురంగా వుందన్నారు.మావోయిస్టు లు జనజీవనస్రవంతి లో కలవాలని ప్రజాస్వాయుతంగా పోరాడాలని కోరుతూ పుంఖాను ఫూంకాలుగా ప్రకటనలు ఇస్తూ లొంగిపోయిన మావోయిస్టు ల చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పెడుతున్న కేంద్ర హోమ్ శాఖ అధికారులు అదే రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్న ఇన్నయ్యను ఎందుకు అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించడమే నేరమైతే, మీ విధానాలను ఎండగట్టడమే చట్టవ్యతిరేకం అయితే కేంద్రమే రాజ్యాంగాన్ని తుంగలోతోక్కి రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని ప్రజలు అర్థం చేసుకోవాల్సివస్తుందన్నారు. బిజే పి ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కులపట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి విశేషమైన కృషి చేసిన ఇన్నయ్య ను అరెస్ట్ చేసినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం విడ్డూరంగా వుందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చొరవ చూపి ఇన్నయ్యను విడుదల చేయించాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు.

