HomeTelanganaCrime

యాదాద్రి వద్ద రైల్లో మంటలు… కిందికి దూకి పరుగులు పెట్టిన ప్రయాణీకులు

యాదాద్రి వద్ద రైల్లో మంటలు… కిందికి దూకి పరుగులు పెట్టిన ప్రయాణీకులు

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 12703) రెండు కోచ్‌లు శుక్రవారం యాదాద్రి-భువనగిరి జిల్లా

తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక.. మేడారం జాతర…
అసెంబ్లీ సమావేశాలుప్రారంభం… రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన కేసీఆర్
ఉపా, అర్బన్ నక్సల్స్ పేరుతో తెలంగాణలో ఎంతో మందిపై కేసులు పెడుతున్నారు : మధు యాష్కి గౌడ్

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 12703) రెండు కోచ్‌లు శుక్రవారం యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

పగిడిపల్లి-బొమ్మాయిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒక కోచ్‌ నుంచి పొగలు, మంటలు వ్యాపించాయి.

ప్రమాదాన్ని గమనించిన వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

పక్కనే ఉన్న బోగీల్లో ఉన్న పలువురు భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. అయితే భయాందోళనలకు గురైన ప్రయాణీకులు రైలు నుంచి కిందికి దూకు పరుగులు పెట్టారు.

తర్వాత, కోచ్‌లను వేరు చేసి, భద్రతా తనిఖీలు చేసిన‌ తర్వాత, అధికారులు రైలును ఫ్లాగ్ ఆఫ్ చేశారు.