HomeEditor's ChoiceGeneral

నమ్మకద్రోహం పెరిగింది ‍- డీజీపీ శివధర్ రెడ్డి

నమ్మకద్రోహం పెరిగింది ‍- డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో మొత్తం నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 30, 2025న జరిగిన ప్రెస్ మీట

“దక్కన్ మైగ్రేషన్” అనే ట్రెండ్ లో హైదరాబాద్ యువత
కృష్ణవేణి, పుష్పిణిలకు సెంట్రల్ ‘వర్సిటీ డాక్టరేట్
మాతృభాషల పరిరక్షణ మనందరి బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో మొత్తం నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 30, 2025న జరిగిన ప్రెస్ మీట్‌లో 2025 వార్షిక పోలీసు నివేదికను విడుదల చేస్తూ ఈ వివరాలు పంచుకున్నారు. 2024లో 2,34,158 కేసులు నమోదు కాగా, 2025లో 2,28,695 కేసులకు తగ్గాయి. ఐపీసీ, బీఎన్‌ఎస్ కేసులు 1,69,477 నుంచి 1,67,018కి తగ్గాయి.

తగిన్నవి:
హత్యలు , అత్యాచారాలు , దోపిడీలు , అల్లర్లు , కిడ్నాపింగ్లు, దొంగతనాలు,మోసాలు తగ్గాయని నమ్మక ద్రోహాలు మాత్రం పెరిగాయని డీజీపీ తెలిపారు.

పెరిగినవి:
మాదక ద్రవ్యాల కేసులు పెరిగాయి ,రోడ్డు ప్రమాదాలు 5.68% పెరిగాయి , కానీ మరణాలు 7.9% తగ్గాయి.
హైదరాబాద్ కమిషనరేట్పరిధిలో క్రైం రేట్ 15% తగ్గింది, అత్యాచారాలు 31% తగ్గాయి, సైబర్ క్రైమ్ 8% తగ్గింది.

శాంతిభద్రతలు:
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, హింసాత్మక నేరాలు, మావోయిస్ట్, మతపరమైన, టెర్రర్ కార్యకలాపాలు నియంత్రణలో ఉన్నాయని శివధర్ రెడ్డి తెలిపారు. శ్రీరామనవమి, బోనాలు, గణేశ్ చతుర్థి, ఈద్-ఉల్-ఫిత్ర్, మొహర్రం వంటి పండుగలు శాంతియుతంగా జరిగాయన్నారు.
మావోయిస్ట్ సరెండర్లు: 2025లో 509 మావోయిస్ట్ క్యాడర్లు లొంగిపోయారు (ఇద్దరు సెంట్రల్ కమిటీ, 11మంది స్టేట్ కమిటీ సభ్యులు ), ఇందులో 483 చత్తీస్‌గఢ్ నుంచి, 24 తెలంగాణ నుంచి.

డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్‌లో ప్రాక్టివ్ పోలీసింగ్, మెరుగైన ఇన్వెస్టిగేషన్, డేటా-డ్రివెన్ క్రైం అనాలిసిస్ వంటి చర్యలు నేరాల తగ్గుదలకు కారణమని పేర్కొన్నారు.