తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పోలేపల్లిలో జరిగిన నూతనంగా ఎన్
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పోలేపల్లిలో జరిగిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పోలేపల్లి డబుల్ బెడ్‌రూం కాలనీలో 56 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ , నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పేదలకు భూములు, ఇళ్లు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. అలాగే, గ్రామీణాభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామని, స్థానిక నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. “అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మరియు కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారు. తమకు సీట్లు దక్కలేదని కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇద్దరు లేదా ముగ్గురు బరిలో దిగడంతో కొన్ని సీట్లు కోల్పోయాం. అయినా పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ మద్దతుదారులు వేళ్లమీద లెక్కపెట్టేంత సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. ఇది ప్రజలు కాంగ్రెస్‌పై చూపిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది” అని అన్నారు.
ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చేర్చడంలో వెనుకబడ్డాం:
పొంగులేటి తన ప్రసంగంలో మరో కీలక అంశాన్ని లేవనెత్తారు. “గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ప్రజాక్షేత్రంలో నిలబడేది మనమే. అయితే పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్న మనమంతా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు సరిగ్గా వివరించడంలో వెనుకబడిపోయాం. ఇకనైనా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లి చెప్పుకోవాలి. అది మనందరి బాధ్యత” అని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులు కూడా చేశామని ప్రచారం చేస్తే, మనం మాత్రం ఇన్ని మంచి పనులు చేస్తున్నా వాటిని సరిగా చెప్పుకోలేకపోతున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు పొంగులేటి
“కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా, మొదటి సంవత్సరంలోనే రూ. 22,500 కోట్లు ఖర్చుపెట్టి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తున్నాం. మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నా వాటిని సరిగా చెప్పుకోలేకపోతున్నాం” అని ఆవేదన వ్యక్తం
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచినవారిని సత్కరించడమే కాకుండా, ప్రభుత్వ పథకాల పంపిణీ కూడా జరిగింది.

