HomeEditor's ChoiceNational

ఆదివాసీ యువకుడి మొహంపై మూత్రం పోసే భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది ? వారే తిరగబడితే ఏం జరుగుతుంది?

ఆదివాసీ యువకుడి మొహంపై మూత్రం పోసే భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది ? వారే తిరగబడితే ఏం జరుగుతుంది?

మధ్యప్రదేశ్ లోని సిద్ది జిల్లాలో ఓ ఆదివాసీ యువకుడి మొహం పై ప్రవేశ్ శుక్లా అనేవ్యక్తి మూత్రం పోసిన వీడియో దేశవ్యాప్తంగా ధిగ్భ్రాంతికి గురి చేసింది. దే

ఐపీఎల్ మినీ వేలం…రికార్డు ధరకు కామెరూన్ గ్రీన్… అమ్ముడైన, అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా
అతివేగమా..!? నిర్లక్ష్యమా..!?
కాంగ్రెస్ నేతల ఇళ్లముందు చాకిరేవు పెడతాం -రజక సంఘం నేతలు

మధ్యప్రదేశ్ లోని సిద్ది జిల్లాలో ఓ ఆదివాసీ యువకుడి మొహం పై ప్రవేశ్ శుక్లా అనేవ్యక్తి మూత్రం పోసిన వీడియో దేశవ్యాప్తంగా ధిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలో ఆదివాసులపై జరుగుతున్న దారుణాలను మరో సారి చర్చలోకి తీసుకవచ్చింది. ప్రవేశ్ శుక్లాను అరెస్టు చేసి, అతని ఇంటిని కూల్చి వేసి , బాధిత ఆదివాసీ యువకుడి కాళ్ళను ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ కడిగి ఈ సమస్యను చల్లబర్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ అసలు ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. దేశంలో ఆదివాసుల పట్ల తరతరాలుగా సమాజం చూపిస్తున్న వివక్ష, పాల్పడుతున్న అణిచివేత, దోపిడీలు ఆగేదెప్పుడు అనే దయనీయమైన ప్రశ్నలు ఆదివాసీలు వేస్తూనే ఉన్నారు.

భారతదేశంలో ఆదివాసీల పట్ల జరుగుతున్న దారుణాలు చాలావరకు పోలీసు స్టేషన్ వరకు రావు. వచ్చినవి కూడా ఆదివాసీలకు అనుకూలంగా పరిష్కారం కావు. అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలు ఎప్పుడైనా పొరపాటున తెల్లబట్టలవాళ్ళ మధ్యకు వచ్చారంటే వాళ్ళకు నరకం కనపడుతుంది.

తరతరాలుగా ఆదివాసులపై దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో…2018 లో కేరళలో జరిగిన ఆదివాస్దీ యువకుడు మధు హత్య మర్చిపోలేము పాలక్కాడ్ జిల్లా అట్టప్పాడిలోని చిండక్కి కుగ్రామానికి చెందిన మధు అనే గిరిజనుడు ఆకలి తట్టుకోలేక ఓ బ్రెడ్ ముక్కను దొంగిలించాడనే నెపంతో స్థానికులు అతన్ని కొట్టి చంపిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సంఘటనపై అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఇక ఈ సంవత్సరం జరిగిన ఘటనలు ఆదివాసీలపై దుర్మార్గాలు ఆగకపోగా పెరుగుతున్నాయని రుజువు చేస్తున్నాయి.
జనవరి 2023లో, మధ్యప్రదేశ్‌లోని దేవ్రా గ్రామంలో గిరిజనుల సమూహంపై అగ్రవర్ణాల గుంపు దాడి చేసింది. గిరిజనులు క్రైస్తవ మతంలోకి మారారనే ప్రచారంతో ఈ దాడి జరిగినట్లు సమాచారం.
జనవరి 2023లో మధ్యప్రదేశ్‌లో 22 ఏళ్ల గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు.
ఫిబ్రవరి 2023లో, ఒడిశాలోని జాజ్‌పూర్ గ్రామంలో ఒక గిరిజన మహిళపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడవిలో కట్టెలు సేకరిస్తున్న సమయంలో మహిళపై దాడి జరిగినట్లు సమాచారం.
మార్చి 2023లో, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా గ్రామంలో ఒక గిరిజన వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపారు. సదరు వ్యక్తి తన భూమిని సదరు వ్యక్తులకు విక్రయించేందుకు నిరాకరించినందుకు దాడికి పాల్పడ్డాడని సమాచారం.

ఇవి పోలీసు రికార్డుల్లో ఉన్న కేసులు మాత్రమే అసలు పోలీసు స్టేషన్ గడప తొక్కని, స్టేషన్ కు వచ్చినా ఆదిపత్య శక్తుల ఒత్తిడితో కేసులు నమోదు కాని సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి.

2021లో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) షెడ్యూల్డ్ తెగల (STల)పై 8,802 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని నివేదించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.4% పెరిగింది.

హత్యలు (1,884 కేసులు)
అత్యాచారాలు (1,210 కేసులు)
దాడులు (1,071 కేసులు)
ఆస్తి నాశనం (992 కేసులు)
గాయపరచడం (884 కేసులు)

ఎస్టీలపై అట్రాసిటీ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు:

మధ్యప్రదేశ్ (2,627 కేసులు)
రాజస్థాన్ (2,121 కేసులు)
ఒడిశా (676 కేసులు)
మహారాష్ట్ర (628 కేసులు)
తెలంగాణ (512 కేసులు)
భారతదేశంలో గిరిజనులపై హింసకు కారణాలు సంక్లిష్టమైనవి మరియు బహుముఖమైనవి. ఈ సమస్యకు దోహదపడే కొన్ని అంశాలు:
భూమి అన్యాక్రాంతం: గిరిజనుల భూమిని వారి నుండి గిరిజనేతరులు చట్టపరమైన మార్గాల ద్వారా లేదా బలవంతంగా తీసుకుంటారు. ఇది సంఘర్షణ మరియు హింసకు దారి తీస్తుంది.
పేదరికం: గిరిజనులు పేదలు, ఇది వారిని శ్రమ దోపిడీకి గురి చేస్తుంది.
వివక్ష: గిరిజనులు తరచుగా ఇతర వర్గాల నుండి వివక్షను ఎదుర్కొంటారు. ఇది ఆగ్రహం, హింసకు దారి తీస్తుంది.
విద్య, అవగాహన లేకపోవడం: చాలా మంది గిరిజనులకు విద్య, వారి హక్కుల గురించి అవగాహన లేదు. ఇది వారిని మరింత దోపిడీకి గురి చేస్తుంది.
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 కూడా గిరిజనులను రక్షించలేకపోతోంది.

ఈ పరిస్థితుల వల్ల పలు చోట్ల ఆదివాసులు దోపిడి దౌర్జన్యాలకు గురవుతూ బతుకులీడుస్తుండగా మరికొన్ని చోట్ల ఎదురు తిరిగి మావోయిస్టులతో చేతులు కలుపుతున్నారు.
దేశంలో వందల ఏళ్ళుగా దోపిడికి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆదివాసులది. తెలంగాణలో కిమురం భీం, ఏపీలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో తిరుగుబాటు తో సహా రాంజీ గోండు పోరాటం, బీర్సా మూండా తిరుగుబాటు , బెంగాల్ సంతాల్ ల తిరుగుబాటు, కాకతీయ రాజులకు వ్యతిరేకంగా సమ్మక్క, సారక్క తిరుగుబాటు…. ఇలా చెప్పుకుంటూ పోతే దేశ చరిత్ర నిండా ఆదివాసుల తిరుబాట్లు అడుగడుగునా కనపడతాయి. వాళ్ళు ఎంత అమాయకులో అంత పోరాట యోధులు కూడా. సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే, ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటే పరిస్థితులు ఎక్కడికైనా దారి తీయవచ్చు.