తెలంగాణ స్టార్టప్ లో బిట్స్ పిలాని విద్యార్థులు భాగస్వామ్యం అవ్వాలి. దేశాభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే…… విజయాలు సొంతమవుతాయి. తెలంగాణ రాష
తెలంగాణ స్టార్టప్ లో బిట్స్ పిలాని విద్యార్థులు భాగస్వామ్యం అవ్వాలి.
దేశాభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే…… విజయాలు సొంతమవుతాయి.
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
జవహర్ నగర్, (నినాదం): సాంకేతిక విప్లవంలో దేశ ప్రజలు జీవనం సాగిస్తున్నారని విద్యార్థులు నూతన టెక్నాలజీని సృష్టించి పరిపాలన సౌలభ్యం సులువయ్యేలా తయారు చేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచ స్థాయి గుర్తింపు బిట్స్ విద్యార్థులు తెలంగాణకు తేవాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ లోని బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో బీజీఎమ్ 2026 సమ్మేళనం చైర్ పర్సన్ సాకూర్ ఆధ్వర్యంలో శనివారం బిట్స్ పిలాని పూర్వ విద్యార్థుల కలయిక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడుతూ ప్రతి రంగంలో ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోందని ఏఐ తోనే మానవ మనుగడ ప్రయాణమవుతుందని తెలంగాణలో ఐటీ హబ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించిందని అన్నారు .వ్యవసాయ రంగంలో ఏఐ ఇప్పటికే తోడైందని, వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ రంగం ఇప్పటికే కొత్త పుంతలు తొక్కుతుందని దేశం మొత్తం ఏఐ ఆధారిత వ్యవసాయ రంగం వృద్ధి చెంది భవిష్యత్తులో మరో నూతన హరిత విప్లవం సాధిస్తుందని తెలిపారు. నేడు అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరిగిందని ప్రపంచం మొత్తం, ఈ రంగంలో ఇప్పటికే నవ పుంతలు తొక్కుతోందని తెలిపారు. త్వరలోనే మీసేవ కేంద్రాలలో అందించే సేవలను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేస్తున్నామని బిట్స్ పిలాని విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములు అయి సాంకేతికతను అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. బిట్స్ పిలాని విద్యార్థులు ఒక్క చోదక శక్తిగా తయారై ఇక్కడి ఆవిష్కరణల వ్యవస్థను మరింత బలోపితం చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్వీస్ లో ఉన్న 90 మంది బిట్స్ పూర్వ విద్యార్థులు, సీఈవోలు, బిట్స్ విద్యార్థులు, ప్రొఫెసర్లు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

