HomeEditor's ChoiceGeneral

మెస్సీతో సెల్ఫీ కోసం అతి చేసిన సీఎం భార్య -వెల్లువెత్తిన విమర్షలు

మెస్సీతో సెల్ఫీ కోసం అతి చేసిన సీఎం భార్య -వెల్లువెత్తిన విమర్షలు

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ 'GOAT ఇండియా టూర్ 2025'లో భాగంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ద

ముఖ్యమంత్రికి నదీ జలాలపై అవగాహన శూన్యం -కేటీఆర్
నాంపల్లి కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి
రేవంత్ పై ఆర్బీఐ గవర్నర్ ప్రశంసలు

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ ‘GOAT ఇండియా టూర్ 2025’లో భాగంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, మెస్సీతో పదేపదే సెల్ఫీలు తీసుకున్న తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చూయింగ్ గమ్ నములుతూ ఫోటోలకు పోజులివ్వడం, మెస్సీ సహచరుడు రోడ్రిగో డి పాల్‌ను పక్కకు జరపమని కోరినట్లు ఆరోపణలు రావడంతో మెస్సీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తనను అగౌరవంగా, అనవసరంగా అభివర్ణించారు.

డిసెంబర్ 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెస్సీ మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రాజెక్ట్ మహాదేవ’ (మహా-దేవా) అనే గ్రాస్‌రూట్స్ ఫుట్‌బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అండర్-13 ఫుట్‌బాలర్లను గుర్తించి, శిక్షణ ఇచ్చి, 2034 ఫిఫా వరల్డ్ కప్‌లో భారత్ ప్రాతినిధ్యం వహించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో పాటు బాలీవుడ్ స్టార్లు టైగర్ ష్రాఫ్, అజయ్ దేవ్‌గన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. మెస్సీ, సచిన్‌ల మధ్య జెర్సీ మార్పిడి, పిల్లలతో ఆడిన ఫుట్‌బాల్ సెషన్ వంటివి ఆకట్టుకున్నాయి.అయితే, అమృత ఫడ్నవీస్ మెస్సీతో రెండుసార్లు సెల్ఫీలు తీసుకోవడం, చూయింగ్ గమ్ నములుతూ ఉండటం వీడియోలో రికార్డ్ కావడంతో వివాదం ముదిరింది.

ఈ వీడియో వైరల్ కాగానే నెటిజన్లు “అగౌరవం”, “అతి ప్రవర్తన” అంటూ ట్రోల్ చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోపై కూడా వ్యంగ్య కామెంట్లు, విమర్శలు కురిశాయి.మరోవైపు, మెస్సీ మూడు రోజుల భారత పర్యటనలో కోల్‌కతాలో నిర్వహణా లోపాల వల్ల గందరగోళం ఏర్పడగా, హైదరాబాద్‌లో ఏర్పాట్లు ప్రశంసలు అందుకున్నాయి. ముంబై కార్యక్రమం మొత్తంమీద సక్సెస్‌ఫుల్‌గా సాగినప్పటికీ, ఈ సెల్ఫీ వివాదంతో మెస్సీ పర్యటన మరోసారి చర్చనీయాంశమైంది. ఈ రోజుతో భారత్ లో మెస్సీ పర్యటన ముగుస్తుంది.