HomeEditor's ChoiceGeneral

తెలంగాణలో కృష్ణార్జునుల పాలన

తెలంగాణలో కృష్ణార్జునుల పాలన

ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లు కృష్ణార్జును

శివసేనను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ పొత్తు
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్
BRS:అసెంబ్లీ నుంచి ఈరోజు వాకౌట్, రేపు బహిష్కరణ

ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లు కృష్ణార్జునుల పాత్ర పోషించారని చెప్పవచ్చు..గ్లోబల్ సమ్మిట్ లో ఇన్వెస్టర్స్ పెద్దఎత్తున పాల్గొన్నవారిని వెన్నుతట్టిన ఘనత జంటగా లభించింది.ఇందులో మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ఐటీ శాఖ, తెలంగాణ పరిశ్రమల శాఖలలో పెట్టుబడుల ఆకర్షణకు
మరింత ముందు వరుసలో నిలిచి సక్సెస్ అయ్యారు.ఆయా రంగాల్లో పెట్టుబడుల పరంగా చూస్తే ఐటీ,పరిశ్రమ రంగాల్లో విప్లవం విజయవంతం అయిందని చెప్పవచ్చు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ఐటీ రంగానికి వన్నె తేవడంలో మంత్రి శ్రీధర్ బాబు పాత్ర కీలకమని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు .విదేశీ పెట్టుబడుల సదస్సులో సీఎం తో సహా శ్రీధర్ బాబు ప్రేరణకలిగించే అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ఫీనిక్స్ పక్షిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని చెప్పడం శ్రీధర్ బాబు కర్తవ్యం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా..ఇంకా సూటిగా చెప్పాలంటే కృష్ణాఅర్జునులుగా మారిపోయారు.ప్రతి సభలు వేదికగా శ్రీధరన్న ఎట్లా చెబితే అట్లా ముందుకు వెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి అంటూనే ఉన్నారు.ఇలా శ్రీధర్ బాబు చేస్తున్న పనితీరుకు,కృషికి అభినందనలు అందుకుంటున్నారు.తెలంగాణ ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ గా మార్చేందుకు కృషి చేస్తున్న వారిలో ఇద్దరిది ప్రధాన భూమిక ఐనప్పటికీ శాఖల పరంగా దుద్దిళ్లకు తగ్గ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం.
ఇక భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా… దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.మేం వేసే ప్రతి అడుగు… చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా “రేపటి తెలంగాణ” కోసమే అని వివరించడం ద్వారా ఎంతో నిర్మాణాత్మక వంతమైన రీతి లో తెలంగాణ అభివృద్ధి ని “ఫీనిక్స్” పక్షి స్ఫూర్తితో ఇన్నోవేషన్, హ్యూమన్ క్యాపిటల్, సస్టైనబులిటీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా తెలంగాణను మార్చాలనే లక్ష్యంతోనే “తెలంగాణ రైజింగ్”కు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఎకనామిక్ రీ అలైన్‌మెంట్స్, టెక్నలాజికల్ డిస్రప్షన్, క్లైమేట్ అన్‌సెర్టెనిటీ లాంటి సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం వేసిన తొలి అడుగు “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” అని అన్నారు. భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చిన్నదే అయినా దేశ జీడీపీలో మాత్రం 5 శాతం వాటాను కలిగి ఉందన్నారు. 2024 – 2025 లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా నమోదు అయ్యిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు, జాతీయ సగటు కంటే 1.8 రేట్లు ఎక్కువ అని వివరించారు. రాష్ట్ర ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎకానమీ వృద్ధి రేటు 7.6 శాతం కాగా, జాతీయ సగటు 6.6 శాతం మాత్రమే అన్నారు. రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు 11.9 శాతంగా కాగా, అదే జాతీయ సగటు 10.7 శాతంగా ఉందన్నారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ జీఎస్ వీఏ 12.6 శాతం వృద్ధి రేటుతో రూ.2.46 లక్షల కోట్ల నుంచి రూ.2.77 లక్షల కోట్లకు పెరిగిందని సమగ్ర నివేదికను మంత్రి వెల్లడించారు.మాన్యుఫ్యాక్చరింగ్, కన్ స్ట్రక్షన్, మైనింగ్, క్వారీయింగ్, ఎలెక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, ఇతర యుటిలిటీస్ లాంటి ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్లలోనూ తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు కావడం తమ ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశంలోనే తొలి ఏఐ పవర్డ్ విలేజ్ గా మారిన మంథని నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామం “రేపటి తెలంగాణ”కు మార్గదర్శిగా నిలిచిందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ ఐటీఐలు, ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, లైఫ్ సైన్సెస్ హబ్ “వన్ బయో”, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ క్వాంటం టెక్నాలజీ లాంటి విప్లవాత్మక అడుగులు ప్రపంచపటంలో “తెలంగాణ”ను ప్రత్యేకంగా నిలుపుతాయన్నారు. రేపటి కోసం, భవిష్యత్ తరాలకు భరోసాగా తెలంగాణతో కలిసి భవిష్యత్తును నిర్మించేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, నిపుణులదృష్టికి తీసుకెళ్లారు.వారిని అభినందిస్తూ,ఆకట్టుకొని గ్లోబల్ సమిట్స్ ను సక్సెస్ చేసి అందరి మెప్పు పొందారు