HomeEditor's ChoiceGeneral

మావోయిస్టు పార్టీ ప్రకటన‌: 16 మంది అరెస్టు అక్రమం…బీజేపీ ఎజెండాకు మద్దతు ఇవ్వొద్దు

మావోయిస్టు పార్టీ ప్రకటన‌: 16 మంది అరెస్టు అక్రమం…బీజేపీ ఎజెండాకు మద్దతు ఇవ్వొద్దు

అసిఫాబాద్ జిల్లాలో నిరాయుధంగా ఉన్న 16 మంది మావోయిస్టులను అరెస్టు చేయడం ద్వారా తెలంగాణలో ఉన్న సామరస్య‌ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మ

మహిళ వేషంలో దాక్కున్న పోలీసు అరెస్ట్
కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులు అరెస్టు
గాదె ఇన్నారెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

అసిఫాబాద్ జిల్లాలో నిరాయుధంగా ఉన్న 16 మంది మావోయిస్టులను అరెస్టు చేయడం ద్వారా తెలంగాణలో ఉన్న సామరస్య‌ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు సిర్పూర్(యు) మండలంలోని కకర్ బుడ్డీ, బాల్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న తమ‌ సహచరులను 16 మందిని అరెస్టు చేశారని, అందులో ఇద్దరు గ్రామస్తులు కూడా ఉన్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిది జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించెందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టుల హాజరు పర్చాలని జగన్ డిమాండ్ చేశారు.

”ఇటువంటి చర్యలను అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని, తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు వీలుగా ఉద్యమించాలని జగన్ కోరారు.
కేంద్రంలోని ఆర్.ఎస్.ఎస్-బీజేపీ ఫాసిస్టు పార్టీ కేవలం కొద్దిమంది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగిస్తోంది. దానిలో భాగంగానే మావోయిస్టు ముక్త్(దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను, భావజాలంను లేకుండా చేయడం), ప్రతిపక్ష ముక్త్ లక్ష్యంతో కగార్ యుద్ధాన్ని అమలు చేస్తుంది. ఆరెస్సెస్-బీజేపీలు దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సామాజిక వ్యవస్థను నిర్మించేందుకు రూపొందించుకున్న విధానాలను కొనసాగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.” అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇంకా జగన్ తన ప్రకటనలో ఈ విధంగా అన్నారు
”ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, ఏక్ చునావ్, ఏక్ పార్టీ నినాదాలతో దేశంలోని అన్ని పార్టీలను నిర్వీర్యం, నిర్మూలన చేసే పథకంతో బీజేపీ ముందుకు పోతున్నది. ఎలక్షన్ కమీషన్, కోర్టులు, సీబీఐ, ఎస్ఐఏ, ఇతర రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను తన కంట్రోల్ లో పెట్టుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతర వేసింది. దానికి బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణ. కాబట్టి నేడు ఆర్.ఎస్.ఎస్- బీజేపీలు దేశంలో అత్యంత ప్రమాదకరమైన శక్తులుగా నిరూపితమైయ్యాయి. వారు కొనసాగిస్తున్న ఆర్థిక పాలసీలు కార్పొరేట్ల ప్రయోజనాలకు మాత్రమే. వారు తెస్తున్న పాలసీలు, చట్టాలు దేశంలోని ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు అన్ని వర్గాలకు ప్రమాదకరమే. కాబట్టి అందరూ ఏకమై ఆర్.ఎస్.ఎస్-బీజేపీ లకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నాం.”