HomeEditor's ChoiceGeneral

నిజాం వారసులపై తెలంగాణ ప్రభుత్వం గెలుపు

నిజాం వారసులపై తెలంగాణ ప్రభుత్వం గెలుపు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువైన 102 ఎకరాల భూమిపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. వ

ముఖ్యమంత్రికి నదీ జలాలపై అవగాహన శూన్యం -కేటీఆర్
ప్రభుత్వం రూ.500 నోట్లను మార్చి నాటికి నిలిపివేస్తుందా ?
16 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ -కేంద్రానికి కోర్టు సూచన‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువైన 102 ఎకరాల భూమిపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. వనస్థలిపురం సమీపంలోని సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలో గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌కు చెందిన ఈ 102 ఎకరాలు అటవీ భూమేనని, ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదంలో నిజాం వారసులు, సాలార్‌జంగ్ మూడవ వారసులు (సాలార్ జంగ్ III, మీర్ యూసుఫ్ అలీ ఖాన్ వారసులు) భూమిపై హక్కులు తమవేనని పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.ఈ భూమి పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉందని, నగరాల్లో లంగ్ స్పేసెస్ తగ్గుతున్న నేపథ్యంలో హైదరాబాద్, సికిందరాబాద్ నగరాలకు ఇది మరింత ముఖ్యమని ధర్మాసనం గుర్తు చేసింది. తీర్పు వెలువడిన ఎనిమిది వారాల్లోపు ఈ 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ కాపీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని సూచించింది.ఈ తీర్పుతో దీర్ఘకాలిక భూ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. అటవీ శాఖకు ఈ విజయం ప్రతిష్టాత్మకమైనదని అధికారులు తెలిపారు.