బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర అస్థిరత నెలకొని ఉంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన యూత్ ఉద్యమంలో కీలక నాయకుడు షరీఫ్ ఓస్మాన్ హాదీ (ఇంకిలాబ్
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర అస్థిరత నెలకొని ఉంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన యూత్ ఉద్యమంలో కీలక నాయకుడు షరీఫ్ ఓస్మాన్ హాదీ (ఇంకిలాబ్ మంచా స్పోక్స్‌పర్సన్) డిసెంబర్ 12న హత్యాయత్నంలో గాయపడి, సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 18న మరణించాడు. ఈ మరణం వార్త బయటకు రాగానే ఢాకా సహా దేశవ్యాప్తంగా భారీ అల్లర్లు మొదలయ్యాయి.
కీలక సంఘటనలు:మీడియా సంస్థలపై దాడులు జరిగాయి. దేశంలోని ప్రముఖ వార్తాపత్రికలు డైలీ ప్రొథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. జర్నలిస్టులు ఇందులోంచి అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రెండు మీడియా సంస్థలను ఆందోళనకారులు “ఇండియా అనుకూల” మీడియాగా ఆరోపించారు.
సాంస్కృతిక, రాజకీయ లక్ష్యాలు: షేక్ ముజిబుర్ రెహమాన్ ఇల్లు (ధన్‌మండి-32), అవామీ లీగ్ కార్యాలయాలు, చయనాట్ (బెంగాలీ సాంస్కృతిక సంస్థ) భవనం దహనమయ్యాయి.
మైనారిటీలపై దాడులు: మైమెన్‌సింగ్‌లో ఒక హిందూ యువకుడిని బ్లాస్ఫెమీ ఆరోపణలతో సజీవంగా దహనం చేశారు. హిందువులు, బౌద్ధులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
ఆందోళనల్లో భారీగా ఇండియా వ్యతిరేక నినాదాలు రేగుతున్నాయి. చిత్తగాంగ్‌లో ఇండియన్ అసిస్టెంట్ హై కమిషన్ దగ్గర దాడులు జరగగా నలుగురు గాయపడ్డారు.
ప్రభుత్వ రెస్పాన్స్: మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం డిసెంబర్ 20న జాతీయ సంతాప దినం ప్రకటించింది. ఆర్మీని రంగంలోకి దింపి, శాంతి కోసం పిలుపునిచ్చింది. కానీ రాడికల్ గ్రూపుల ప్రభావం పెరిగినట్టు విమర్శలొస్తున్నాయి.
కాగా, ప్రస్తుత హింసపై అనేక దేశాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీలు/అలర్ట్‌లు జారీ చేశాయి:
ఇండియా: ఇండియా నుండి పౌరులెవ్వరూ బంగ్లాదేశ్‌కు ప్రయాణం చేయవద్దని, అక్కడ ఉన్నవారు అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలని భారత అధికారులు సలహా ఇచ్చారు. బంగ్లా దేశ్ లోని ఇండియన్ రాయబార కార్యలయం దగ్గర దాడుల నేపథ్యంలో సెక్యూరిటీ పెంచారు.
అమెరికా (US): అమెరికా రీకన్సిడర్ ట్రావెల్ (లెవెల్ 3) అడ్వైజరీ ప్రకటించింది. డెమాన్‌స్ట్రేషన్లు హింసాత్మకంగా మారవచ్చని హెచ్చరిక జారీ చేసింది. తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
యూకే (UK): బంగ్లా దేశ్ లోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళ వద్దని తమ పౌరులను కోరింది. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు అసలు వెళ్ళవద్దని చెప్పింది.
కెనడా: హై డిగ్రీ ఆఫ్ కాషన్ ఎక్సర్‌సైజ్ చేయాలని, డెమాన్‌స్ట్రేషన్లు, హర్తాల్స్ వల్ల హింస రిస్క్ ఉందని తమ పౌరలను హెచ్చరించింది.
ఆస్ట్రేలియా: లార్జ్ గాదరింగ్స్, ప్రొటెస్ట్స్ అవాయిడ్ చేయాలని, ఆర్మీ డిప్లాయ్‌మెంట్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది.

