HomeEditor's ChoiceGeneral

యుద్దానికి సిద్దం: కేసీఆర్ వస్తున్నాడు

యుద్దానికి సిద్దం: కేసీఆర్ వస్తున్నాడు

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పరిమితమైన బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్లీ ఆక్టీవ్ కానున్నార

వయసైపోయిందా? … 20 వేలకే బీహార్ అమ్మాయిలు – ‍మంత్రి భర్త‌ వ్యాఖ్యలు
యూనిఫాం సివిల్ కోడ్ కు మేం వ్యతిరేకం… స్పష్టం చేసిన కేసీఆర్
చివరి దశ పంచాయితీ ఎన్నికలు పూర్తి

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పరిమితమైన బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్లీ ఆక్టీవ్ కానున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలను మొత్తం బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులే నడుపుతున్నారు. అయితే మళ్ళీ ప్రభుత్వం యుద్దానికి తాను స్వయంగా నాయకత్వం వహించడానికి కేసీఆర్ సిద్దమయ్యారు. దీర్ఘ విరామం తర్వాత ఆయన తెలంగాణ భవన్‌కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమవనున్నారు.

తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.ఆదివారం (డిసెంబర్ 21) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టే ప్రజా ఉద్యమం రూపురేఖలపై చర్చించి, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీల నీటికే అంగీకరించి తెలంగాణకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకారం అందిస్తోందని, రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఈ అంశంపై నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని పార్టీ భావిస్తోంది.అదే సమయంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రక్షాళనపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. దీర్ఘకాలం తర్వాత అధినేత తెలంగాణ భవన్‌కు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండింది.