HomeEditor's ChoiceGeneral

కాంగ్రెస్ నేతల ఇళ్లముందు చాకిరేవు పెడతాం -రజక సంఘం నేతలు

కాంగ్రెస్ నేతల ఇళ్లముందు చాకిరేవు పెడతాం -రజక సంఘం నేతలు

గోదావరిఖని,డిసెంబరు23-నినాదం : తమ కులాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ నేత యుగేందర్ 24 గంటల్లో భేషరతుగా క్షమాపణ చెప్పాలని రామగుండం రజక సంక్షేమ సంఘం న

తెలంగాణలో కృష్ణార్జునుల పాలన
శివసేనను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ పొత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరేది లేదా?

గోదావరిఖని,డిసెంబరు23-నినాదం : తమ కులాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ నేత యుగేందర్ 24 గంటల్లో భేషరతుగా క్షమాపణ చెప్పాలని రామగుండం రజక సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేసారు. నియోజకవర్గంలోని కూల్చివేతలపై బీఆర్ఎస్ నేత కౌశికహరి వ్యాఖ్యల నేపధ్యంలో యుగేందర్ అనే కాంగ్రెస్ నేత మాట్లాడుతూ నీవు చాకలి సదువు చదువుకున్నావా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై భగ్గుమన్న రజక సంక్షేమ సంఘం మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో సమావేశంనిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

రజకులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడిన యుగేందర్ అనే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి రజక జాతికి తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. తమను సమాజంలోని అందరూ ఇంటి ఆడబిడ్డల్లా గౌరవిస్తారని గుర్తచేసారు. కాంగ్రెస్ నేతలు పై విధంగా అవమానించడం సరికాదన్నారు.మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇదేనా అని ప్రశ్నించారు. వీర నారి చాకలి ఐలమ్మ స్పూర్తితో తమ జాతిలోనూ ఉన్నత విద్యను అభ్యసించిన వారెందరో ఉన్నారని గుర్తుచేసారు. చాకలి వాళ్లకు చదువురాకూడదా అని ప్రశ్నించారు. సమావేశంలో సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవయ్య, రాగుల రవీందర్, పైడి రాజయ్య, బిజిగిరి వెంకటరాజం, మామిడి కుమార్, పైడిపల్లి శ్రీనివాస్, మామిడి పోశం, మామిడి మహేందర్, ఎలా బోతారం సదానందం, పొన్నం సారయ్య, నగునూరు రాజేశం, సురేష్ తదితరులు ఉన్నారు.