HomeEditor's ChoiceGeneral

సంస్కారహీనుడు, మురికివాడు: శివాజీపై నిప్పులు చెరిగిన‌ రాంగోపాల్ వర్మ‌

సంస్కారహీనుడు, మురికివాడు: శివాజీపై నిప్పులు చెరిగిన‌ రాంగోపాల్ వర్మ‌

నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన పురుషాహంకార వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. సినీ రంగానికి చెందిన అనేక మంది శివాజీపై దుమ్మెత్తి పోస్తున్

నటుడు శివాజీ హీరోయిన్లపై పురుషాహంకార ‘XXX’ వ్యాఖ్యలు…. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్న మహిళలు
అవును నాకు పొగరే…నన్ను చూసుకొని నాకు పొగరు -బాలకృష్ణ‌
క్షమాపణ చెప్పిన శివాజీ… అందులో నిజాయితీ ఉందా ?

నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన పురుషాహంకార వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. సినీ రంగానికి చెందిన అనేక మంది శివాజీపై దుమ్మెత్తి పోస్తున్నారు. డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ, మహిళల అందం చీరలోనే ఉంటుందని, పొట్టి బట్టలు ధరించి అందాలు ఆరబోయకూడదని సూచించారు. “మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. XXX కనపడే దానిలో ఏమీ ఉండదు” అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి డ్రెస్‌లు వేసుకున్న వారిని బయట పొగడినా, మనసులో “XXX” అని తిట్టుకుంటారని అభ్యంతరకర పదాలను వాడాడు .ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై శివాజీ చేసిన దాడిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. గాయని చిన్మయి శ్రీపాద, యాంకర్-నటి అనసూయ భరద్వాజ్, నటుడు మంచు మనోజ్, నటి మంచు లక్ష్మి వంటి వారు శివాజీని తప్పుపట్టారు. చిన్మయి “XXX” వంటి స్లర్‌లు వాడి మహిళలకు అనవసర సలహాలు ఇవ్వడం సరికాదని విమర్శించారు. అనసూయ “ఇది మా శరీరం.. మీది కాదు. మాకు నచ్చినట్లే మేము ఉంటాం” అంటూ కౌంటర్ ఇచ్చారు.

తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. మంచు మనోజ్ విమర్శలను అభినందిస్తూ మంచు లక్ష్మి చేసిన పోస్ట్‌ను రీపోస్ట్ చేసిన వర్మ, శివాజీని ఉద్దేశించి ఇలా రాశారు: “హే శివాజీ.. నువ్వెవడివైనా సరే, నీ ఇంటి మహిళలు నీలాంటి సంస్కారహీనుడిని, మురికివాడిని భరించడానికి సిద్ధంగా ఉంటే.. వాళ్లకు నీ నీతులు చెప్పు. సమాజంలోని ఇతర మహిళలు, సినీ ఇండస్ట్రీలోని వారు లేదా ఎవరైనా సరే.. వారి విషయంలో నీ చెత్త అభిప్రాయాలను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకో.” అని విమర్శలు చేశాడు.

ఈ వివాదం టాలీవుడ్‌లో మహిళల పట్ల డబుల్ స్టాండర్డ్స్, వ్యక్తిగత స్వేచ్ఛలపై మరిన్ని చర్చలకు దారితీసింది. శివాజీ గతంలో తాను నటించిన చిత్రాల్లో గ్లామర్ సీన్లు ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని విమర్శించడం హిపోక్రసీ అని నెటిజన్స్ అంటున్నారు. శివాజీ ఇంకా ఈ వివాదంపై అధికారికంగా స్పందించలేదు.