HomeEditor's ChoiceGeneral

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విడుదల

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విడుదల

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) చీఫ్ టి. ప్రభాకర్ రావును ప్రత్యేక

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్
అసెంబ్లీ సమావేశాలుప్రారంభం… రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన కేసీఆర్
మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం… కేటీఆర్

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) చీఫ్ టి. ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం (డిసెంబర్ 26) విడుదల చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల పాటు కస్టడీలో విచారణ జరిపిన అనంతరం, గడువు ముగియడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను విడిచిపెట్టారు. డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావును అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

విచారణలో ఆయన సహకరించడం లేదని సిట్ భావించి కస్టడీని పొడిగించింది. పదవీ విరమణ తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఎస్‌ఐబీ చీఫ్‌గా ఎందుకు కొనసాగించిందనే కోణంలో లోతుగా ప్రశ్నించారు. ఈ నియామకం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావుతో తరచూ భేటీలు ఎందుకు జరిగాయని ప్రశ్నించగా, మావోయిస్టుల ముప్పు గురించి బ్రీఫింగ్ ఇవ్వడానికేనని ప్రభాకర్ రావు సమాధానమిచ్చారు. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు ఆయనను విచారించారు. అలాగే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వంటి ఉన్నతాధికారుల వాంగ్మూలాలను కూడా సిట్ నమోదు చేసింది.

ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించనుంది. మరోవైపు, కేసులో తదుపరి చర్యలపై ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్చలు జరిపారు.బీఆర్ఎస్ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్టు ప్రధాన ఆరోపణ ఉంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు మరింత దూకుడుగా సాగనుంది.