HomeEditor's ChoiceGeneral

గోదావరిఖనిలో…వన్‌టౌన్ పోలీసుల నాకాబంది

గోదావరిఖనిలో…వన్‌టౌన్ పోలీసుల నాకాబంది

గోదావరిఖని, డిసెంబర్ 29 ,(నినాదం): గోదావరిఖని ని ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా, తిలక్ నగర్, రమేష్ నగర్, జవహర్ నగర్, ద్వారక నగర్, పరుశురాం నగర్ పరిసరాల్లో వన్

గెలిచిన సర్పంచిపై దాడి.. అంతర్గాంలో ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతల ఇళ్లముందు చాకిరేవు పెడతాం -రజక సంఘం నేతలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన మనాలి ఠాకూర్

గోదావరిఖని, డిసెంబర్ 29 ,(నినాదం): గోదావరిఖని ని ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా, తిలక్ నగర్, రమేష్ నగర్, జవహర్ నగర్, ద్వారక నగర్, పరుశురాం నగర్ పరిసరాల్లో వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా బైకులు, కార్లు, బస్సులు తదితర వాహనాలను ఆపి సోదాలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించారు.సరైన రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11 ఏరియాలో తనిఖీలు నిర్వహించామని పెద్దపెల్లి డిసిపి రామ్ రెడ్డి వెల్లడించారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ తనిఖీలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఈ తనిఖీల్లో గోదావరిఖని ఏసిపి మడత రమేష్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.