ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, భీజాపూర్ జిల్లాలలో జరిగిన రెండు వేరు వేరు ఎన్ కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మరణించారు. సుక్మా జిల్లాలో జనవరి శనివారం ఉదయ
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, భీజాపూర్ జిల్లాలలో జరిగిన రెండు వేరు వేరు ఎన్ కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మరణించారు.
సుక్మా జిల్లాలో జనవరి శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇది 2026 సంవత్సరంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య మొదటి పెద్ద ఎదురుకాల్పులు.
ఈ ఎన్‌కౌంటర్ సుక్మా జిల్లాలోని కొంటా-కిస్తారాం అటవీ ప్రాంతంలో జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందాలు మావోయిస్టుల ఉనికి గురించిన ఇంటెలిజెన్స్ ఆధారంగా యాంటీ-మావోయిస్ట్ ఆపరేషన్ చేపట్టాయి.
ఉదయం నుంచి భారీ కాల్పులు జరిగాయి. ఘటనాస్థలం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో AK-47, INSAS రైఫిల్స్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనమయ్యాయి. మరణించినవారిలో కొంటా ఏరియా కమిటీ సెక్రటరీ మంగ్దు కూడా ఉన్నారు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ప్రకారం, కొంటా ఏరియా కమిటీకి చెందిన అందరు సాయుధ మావోయిస్టులు నిర్మూలించబడ్డారు.
మరోవైపు చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
మొత్తం రెండు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మరణించారు.

