HomeEditor's ChoiceGeneral

వ్యక్తిగా వెళ్తున్నా… బలమైన శక్తిగా వస్తా – కవితమ్మ‌ శపథం

వ్యక్తిగా వెళ్తున్నా… బలమైన శక్తిగా వస్తా – కవితమ్మ‌ శపథం

తెలంగాణ శాసనమండలిలో సోమవారం జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజీనామా ఆమోదానికి ముందు చివరి ప్రసంగంగా మాట్లా

రేవంత్ రెడ్డి ఉగ్రవాది – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
రెండవ విడత కూడా కాంగ్రెస్ జోరు
ఆ ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించలేదు -తీర్పు ఇచ్చిన స్పీకర్

తెలంగాణ శాసనమండలిలో సోమవారం జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజీనామా ఆమోదానికి ముందు చివరి ప్రసంగంగా మాట్లాడిన కవిత.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టుకున్న కవిత.. పార్టీలో జరిగిన అవమానాలు, అవినీతి, అంతర్గత కుట్రలపై నిప్పులు చెరిగారు.

శాసనమండలిలో కవిత కీలక వ్యాఖ్యలుశాసనమండలి సాక్షిగా కవిత మాట్లాడుతూ.. “బీఆర్ఎస్ పార్టీ నన్ను ఘోరంగా అవమానించింది. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా చిత్తశుద్ధితో నిర్వహించా. కానీ అవినీతిని ప్రశ్నించినందుకు నన్ను దారుణంగా వేధించారు. అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ భవనాల వరకు అన్నీ నిర్మాణాల్లో అవినీతి జరిగింది. సిద్దిపేట కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది” అని ఆరోపించారు.2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించిన తర్వాతే తనపై ఆంక్షలు మొదలయ్యాయని.. పార్టీ మీడియా తన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్. అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. నైతికత లేని పార్టీలో ఉండలేను” అని విమర్శించారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చటాన్ని తాను అంగీకరించలేదన్నారు కవిత. తెలంగాణలో ఏం సాధించిందని.. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు వెళ్లిందంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కవిత.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరోపణలపై పార్టీలో ఎవరూ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత.. “నేను ప్రెస్ మీట్ పెట్టి అవినీతిపరుల పేర్లు చెప్పాను. తెల్లవారే సరికి నన్ను సస్పెండ్ చేశారు” అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను, పేదలను పక్కనపెట్టి ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ తన రాజీనామాను ఆస్తుల పంచాయితీగా చిత్రీకరిస్తోందని ఖండించిన కవిత.. “నా పోరాటం ఆత్మగౌరవం కోసం. నా కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఇది ఆస్తుల గొడవ కాదు” అని స్పష్టం చేశారు.

కొత్త పార్టీ ప్రకటన:

మండలి నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. “వ్యక్తిగా బయటకు వెళ్తున్నా.. కానీ శక్తిగా చట్టసభలకు తిరిగొస్తా. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం. యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టిస్తాం” అని ప్రకటించారు.బీఆర్ఎస్ ప్రజల ఆశలను అందుకోలేదని.. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన ఉద్యమకారులను పక్కనపెట్టిందని ఆరోపించారు. రెండు పార్టీలు (బీఆర్ఎస్, కాంగ్రెస్) అవినీతిలో మునిగిపోయాయని విమర్శించారు.