HomeEditor's ChoiceGeneral

TN:లేడీ సింగం ఐపీఎస్ ఇషా ట్రాన్స్ ఫర్ – బీజేపీ, విజయ్ ల మధ్య రహస్య పొత్తుకు నిదర్శనమా ?

TN:లేడీ సింగం ఐపీఎస్ ఇషా ట్రాన్స్ ఫర్ – బీజేపీ, విజయ్ ల మధ్య రహస్య పొత్తుకు నిదర్శనమా ?

సినీ హీరో విజయ్ అద్వర్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ర్యాలీలో ఆ పార్టీ నాయకుడిని ధైర్యంగా అడ్డుకుని వైరల్ అయిన ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్‌పై బదిలీ

రెండవ విడత కూడా కాంగ్రెస్ జోరు
యుద్దానికి సిద్దం: కేసీఆర్ వస్తున్నాడు
చివరి దశ పంచాయితీ ఎన్నికలు పూర్తి

సినీ హీరో విజయ్ అద్వర్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ర్యాలీలో ఆ పార్టీ నాయకుడిని ధైర్యంగా అడ్డుకుని వైరల్ అయిన ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్‌పై బదిలీ వేటు పడింది. పుదుచ్చేరిలో ఎస్పీగా పనిచేస్తున్న ఇషా సింగ్‌ను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి బదిలీ చేసింది.

వివాద నేపథ్యం:

గత సంవత్సరం డిసెంబర్ 9న పుదుచ్చేరిలో టీవీకే అధ్యక్షుడు విజయ్ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీకి అనుమతి ఇచ్చిన సామర్థ్యం 5,000 మంది మాత్రమే. కానీ భారీ జనసమూహం తరలివచ్చింది. ఈ సందర్భంగా టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ స్టేజ్‌పై నిలబడి “లోపల ఖాళీ ఉంది, ఇంకా వచ్చేయండి” అని ప్రకటించారు. దీన్ని విన్న ఇషా సింగ్ వెంటనే మైక్ సీజ్ చేసి, “‘కరూర్‌ తొక్కిసలాటలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని అప్పుడే మరిచిపోయారా?ఎందుకు ఎక్కువమంది ప్రజలను వేదిక వద్దకు రమ్మని పిలుస్తున్నారు’’ అని గద్దించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇషా సింగ్ ‘లేడీ సింగం’గా ప్రశంసలు అందుకున్నారు. కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో 41 మంది మరణించిన ఘటన తర్వాత జరిగిన ఈ ర్యాలీలో ఈమె చూపిన చొరవ, ఇషా సింగ్ చర్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పుదుచ్చేరి హోమ్ మంత్రి నమశ్శివాయం కూడా ఆమెను ప్రత్యేకంగా సత్కరించారు.

ఇషా సింగ్ బ్యాక్‌గ్రౌండ్:

2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్ ముంబైలో 1998లో జన్మించారు. ఆమె తండ్రి యోగేష్ ప్రతాప్ సింగ్ 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడి రాజీనామా చేశారు. తల్లి అభా సింగ్ ప్రముఖ లాయర్, సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు వంటి హైప్రొఫైల్ కేసులు నడిపారు. లా చదివిన ఇషా సింగ్ ఆ తర్వాత ఐపీఎస్ రాసి సెలక్ట్ అయ్యి, సూత్రాలకు కట్టుబడి పనిచేస్తున్నారు.

కాగా, ఈ బదిలీని చాలామంది ‘పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్’గా చూస్తున్నారు. అయితే అధికారికంగా ఇది రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ ఫర్ మాత్రమేనని కేంద్రం చెబుతోంది. ఇషా సింగ్ బదిలీతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. టీవీకే నాయకత్వం ఇంకా స్పందించలేదు.ఈ ఘటన తమిళనాడు, పుదుచ్చేరి రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించింది.