HomeEditor's ChoiceGeneral

ఐ బొమ్మ రవికి షాక్

ఐ బొమ్మ రవికి షాక్

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)కి నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అర

క్యూబ్ నెట్‌వర్క్‌ను, శాటిలైట్ లింకులను హ్యాక్ చేసిన ఐ బొమ్మ రవి
ఒక్క నిమిషం ఆలస్యం -ఓటును కోల్పోయిన యువతి
గోదావరిఖనిలో…వన్‌టౌన్ పోలీసుల నాకాబంది

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)కి నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలో బెయిల్ కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.పోలీసుల తరపు న్యాయవాది వాదనలో బెయిల్ మంజూరు చేస్తే రవి దేశం దాటి పారిపోయే అవకాశం ఉందని, దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకొని కోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

గతంలో కూడా రవికి బెయిల్ నిరాకరించి పలుమార్లు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చిన నేపథ్యంలో ఈ తాజా తీర్పు మరో షాక్‌గా మారింది. పైరసీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ఆరోపణలపై రవి ప్రస్తుతం జైలులోనే కొనసాగుతాడు.