HomeEditor's ChoiceGeneral

శివసేనను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ పొత్తు

శివసేనను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ పొత్తు

మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘటన జరిగింది. థానే జిల్లాలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో బద్ద శతృవులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకు

సినీ నటి ఆమని చేరిక బీజేపీకి ఉపయోగపడుతుందా ?
బీజేపీ, బీఆరెస్ మధ్య పోరాట‍ం నిజమా? లేక ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం నిజమా ?
బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయంలో బండి, ఈటల వర్గాల మధ్య ఘర్షణ‌

మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘటన జరిగింది. థానే జిల్లాలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో బద్ద శతృవులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి మేయర్ కాకుండా అడ్డుకున్నారు.

ఈ ఎన్నికల్లో శివసేన (షిండే ఫ్యాక్షన్)కు 27 సీట్లు,బీజేపీకి 14 సీట్లు,కాంగ్రెస్ కు 12 సీట్లు,ఎన్‌సీపీ (అజిత్ పవార్)కు 4 సీట్లు,ఇండిపెండెంట్స్ కు 2 సీట్లు వచ్చాయి.

మొత్తం 59 సీట్లున్న ఈ కౌన్సిల్‌లో మెజారిటీకి 31 సీట్లు అవసరం. శివసేనకు మరో నాలుగు సీట్లు లేకపోవడంతో బీజేపీ (14 సీట్లు), కాంగ్రెస్ (12 సీట్లు), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (4 సీట్లు) కలిసి ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాడి’ పేరుతో ఏర్పాటు చేసి మెజారిటీ సాధించాయి. ఈ పొత్తు ఫలితంగా బీజేపీ నాయకురాలు తేజశ్రీ కరంజులే పాటిల్ మేయర్ (ప్రెసిడెంట్)గా ఎన్నికయ్యారు. ఆమె శివసేన అభ్యర్థి మనీషా వాలేకర్‌ను ఓడించి, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ పొత్తు బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన 12 మంది కౌన్సిలర్లను, అంబర్‌నాథ్ బ్లాక్ ప్రెసిడెంట్‌ను సస్పెండ్ చేసింది. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. “కాంగ్రెస్ లేదా AIMIMతో పొత్తు అంగీకరించబోం అన్నారు. కాంగ్రెస్ తో కలిసిన వారిపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం” అని ఆయన ప్రకటించారు.

ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చను రేపింది. సాంప్రదాయక శత్రువులైన బీజేపీ మరియు కాంగ్రెస్ స్థానిక స్థాయిలో పొత్తు పెట్టుకోవడం అరుదైన విషయం. ఇది శివసేనకు భారీ దెబ్బగా పరిగణించబడుతోంది.