అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణ మహోత్సవం పాల్గొన్న ఆలయ కమిటీ అధ్యక్షులు అంబటి అర్చన,సంతోష్ రావు గోదావరిఖని, (నినాదం): గోదావరిఖని ఐబీ క
అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణ మహోత్సవం
పాల్గొన్న ఆలయ కమిటీ అధ్యక్షులు అంబటి అర్చన,సంతోష్ రావు
గోదావరిఖని, (నినాదం): గోదావరిఖని ఐబీ కాలనీ లోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం గోదారంగనాథుల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక వైభవంగా జరిగింది. ఈ కల్యాణ కార్యక్రమానికి పట్టణం నలుమూలల నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనంతో పాటు కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ భక్తులు పరవశించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నాదాలతో పాటు సుందరమైన పుష్పాలంకరణలతో ఆలయ ప్రాంగణం దివ్య వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అర్చన–సంతోష్ రావు అంబటి మాట్లాడుతూ, గోదారంగనాథుల కల్యాణ దర్శనం భక్తులకు సుఖసంతోషాలు, కుటుంబ సమైక్యత, శుభాలు కలుగుతాయని తెలిపారు. కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన భక్తులు, దాతలు, ఆలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ నిర్మాణానికి, కల్యాణ మహోత్సవానికి సహకరించిన వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రావు అంబటి, జి. శ్రీనివాస్, పల్లెర్ల కృష్ణ ప్రసాద్, కోటేశ్వరరావు, మిట్ట శంకర్, ముప్పు రాజమౌళి తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

