ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మినీ వేలం యూఏఈలోని అబుదాబి ఎతిహాద్ అరేనాలో అట్టహాసంగా జరిగింది. మొత్తం 77 స్లాట్ల కోసం 10 ఫ్రాంచైజీలు రూ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మినీ వేలం యూఏఈలోని అబుదాబి ఎతిహాద్ అరేనాలో అట్టహాసంగా జరిగింది. మొత్తం 77 స్లాట్ల కోసం 10 ఫ్రాంచైజీలు రూ. 215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ. 25.20 కోట్లకు దక్కించుకుంది. ఈ ధర మిచెల్ స్టార్క్ గత రికార్డును (రూ. 24.75 కోట్లు) అధిగమించింది.
ఈ వేలంలో అన్‌క్యాప్డ్ భారత యువ ఆటగాళ్లు సంచలనం రేపారు. ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) చెరో రూ. 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇద్దరూ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా నిలిచారు. అలాగే శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణను కేకేఆర్ రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది – ఇది శ్రీలంక ఆటగాడికి ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర.కేకేఆర్ అత్యధిక పర్స్ (సుమారు రూ. 64 కోట్లు)తో వేలంలో ఆధిపత్యం చూపింది. సీఎస్‌కే కూడా రూ. 43 కోట్ల పైగా ఖర్చు చేసి జట్టును బలోపేతం చేసుకుంది. మొత్తం 369 మంది ఆటగాళ్లలో 77 మంది (29 మంది విదేశీయులు) అమ్ముడయ్యారు.రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది. ఈ వేలం యువ ప్రతిభలకు, ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత ఇస్తూ సీజన్‌కు ఉత్సాహాన్ని రేపింది.
ఈ వేలంలో అమ్ముడైన అమ్ముడు కాని ఆటగాళ్ళ వివరాలు:
- జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ – అమ్ముడుపోలేదు
- డేవిడ్ మిల్లర్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 2 కోట్లు
- పృథ్వీ షా – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 75 లక్షలు
- డెవాన్ కాన్వే – అమ్ముడుపోలేదు
- కామెరూన్ గ్రీన్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 25.20 కోట్లు
- సర్ఫరాజ్ ఖాన్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 75 లక్షలు
- గస్ అట్కిన్సన్ – అమ్ముడుపోలేదు
- రచిన్ రవీంద్ర – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 2 కోట్లు
- లియామ్ లివింగ్‌స్టోన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 13 కోట్లు
- వియాన్ ముల్డర్ – అమ్ముడుపోలేదు
- వనిందు హసరంగ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 2 కోట్లు
- వెంకటేశ్ అయ్యర్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 7 కోట్లు
- దీపక్ హుడా – అమ్ముడుపోలేదు
- కేఎస్ భరత్ – అమ్ముడుపోలేదు
- క్వింటన్ డి కాక్ – ముంబై ఇండియన్స్ – రూ. 1 కోటి
- రహ్మానుల్లా గుర్బాజ్ – అమ్ముడుపోలేదు
- జానీ బెయిర్‌స్టో – అమ్ముడుపోలేదు
- జామీ స్మిత్ – అమ్ముడుపోలేదు
- బెన్ డకెట్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 2 కోట్లు
- ఫిన్ అలెన్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 2 కోట్లు
- మాట్ హెన్రీ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 2 కోట్లు
- ఆకాశ్ దీప్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 1 కోటి
- జాకబ్ డఫీ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 2 కోట్లు
- శివమ్ మావి – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 75 లక్షలు
- గెరాల్డ్ కోయెట్జీ – అమ్ముడుపోలేదు
- మతీశ పతిరణ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 18 కోట్లు
- స్పెన్సర్ జాన్సన్ – అమ్ముడుపోలేదు
- ఆన్రిచ్ నోర్ట్జే – లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 2 కోట్లు
- ఫజల్హక్ ఫారూఖీ – అమ్ముడుపోలేదు
- రాహుల్ చాహర్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 5.20 కోట్లు
- రవి బిష్ణోయ్ – రాజస్థాన్ రాయల్స్ – రూ. 7.20 కోట్లు
- మహీశ్ తీక్షణ – అమ్ముడుపోలేదు
- ముజీబ్ ఉర్ రెహమాన్ – అమ్ముడుపోలేదు
- అకీల్ హోసేన్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 2 కోట్లు
- అథర్వ తైడే – అమ్ముడుపోలేదు
- అన్మోల్‌ప్రీత్ సింగ్ – అమ్ముడుపోలేదు
- అభినవ్ తేజ్రానా – అమ్ముడుపోలేదు
- అభినవ్ మనోహర్ – అమ్ముడుపోలేదు
- యశ్ ధుల్ – అమ్ముడుపోలేదు
- ఆర్య దేశాయ్ – అమ్ముడుపోలేదు
- ఆకిబ్ దార్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 8.40 కోట్లు
- విజయ్ శంకర్ – అమ్ముడుపోలేదు
- రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ – అమ్ముడుపోలేదు
- మహిపాల్ లోమ్రోర్ – అమ్ముడుపోలేదు
- ఈడెన్ యాపిల్ టామ్ – అమ్ముడుపోలేదు
- ప్రశాంత్ వీర్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 14.20 కోట్లు
- శివాంగ్ కుమార్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 30 లక్షలు
- తనుష్ కోటియన్ – అమ్ముడుపోలేదు
- కమలేశ్ నాగర్‌కోటి – అమ్ముడుపోలేదు
- సన్వీర్ సింగ్ – అమ్ముడుపోలేదు
- రౌచిత్ అహిర్ – అమ్ముడుపోలేదు
- కార్తీక్ శర్మ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 14.20 కోట్లు
- ముకుల్ చౌదరి – లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 2.60 కోట్లు
- తేజస్వి సింగ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 3 కోట్లు
- వంశ్ బేడీ – అమ్ముడుపోలేదు
- తుషార్ రహేజా – అమ్ముడుపోలేదు
- అశోక్ శర్మ – గుజరాత్ టైటాన్స్ – రూ. 90 లక్షలు
- రాజ్ లింబానీ – అమ్ముడుపోలేదు
- కార్తీక్ త్యాగి – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 30 లక్షలు
- సిమర్‌జీత్ సింగ్ – అమ్ముడుపోలేదు
- ఆర్య దేశాయ్ – అమ్ముడుపోలేదు
- నమన్ తివారీ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 1 కోటి
- ఆకాశ్ మధ్వాల్ – అమ్ముడుపోలేదు
- సుశాంత్ మిశ్రా – రాజస్థాన్ రాయల్స్ – రూ. 90 లక్షలు
- వహీదుల్లా జద్రాన్ – అమ్ముడుపోలేదు
- శివమ్ శుక్లా – అమ్ముడుపోలేదు
- యశ్‌రాజ్ పుంజా – రాజస్థాన్ రాయల్స్ – రూ. 30 లక్షలు
- ప్రశాంత్ సోలంకి – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 30 లక్షలు
- విఘ్నేష్ పుత్తూర్ – రాజస్థాన్ రాయల్స్ – రూ. 30 లక్షలు
- కర్ణ్ శర్మ – అమ్ముడుపోలేదు
- కుమార్ కార్తికేయ సింగ్ – అమ్ముడుపోలేదు
- సెదికుల్లా అటల్ – అమ్ముడుపోలేదు
- పతుమ్ నిస్సంక – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 4 కోట్లు
- రాహుల్ త్రిపాఠి – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 75 లక్షలు
- సీన్ అబాట్ – అమ్ముడుపోలేదు
- మైఖేల్ బ్రేస్‌వెల్ – అమ్ముడుపోలేదు
- బెన్ డ్వార్షుయిస్ – పంజాబ్ కింగ్స్ – రూ. 4.40 కోట్లు
- జాసన్ హోల్డర్ – గుజరాత్ టైటాన్స్ – రూ. 7 కోట్లు
- దసున్ శనక – అమ్ముడుపోలేదు
- డారిల్ మిచెల్ – అమ్ముడుపోలేదు
- మాథ్యూ షార్ట్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 1.50 కోట్లు
- టామ్ బాంటన్ – గుజరాత్ టైటాన్స్ – రూ. 2 కోట్లు
- జోర్డాన్ కాక్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 75 లక్షలు
- జోష్ ఇంగ్లిస్ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 8.60 కోట్లు
- టిమ్ సీఫెర్ట్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 1.50 కోట్లు
- కైల్ జేమీసన్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 2 కోట్లు
- ఆడమ్ మిల్నే – రాజస్థాన్ రాయల్స్ – రూ. 2.40 కోట్లు
- లుంగి ఎంగిడి – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 2 కోట్లు
- ముస్తాఫిజుర్ రెహమాన్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 9.2 కోట్లు
- చేతన్ సకారియా – అమ్ముడుపోలేదు
- కుల్దీప్ సేన్ – రాజస్థాన్ రాయల్స్ – రూ. 75 లక్షలు
- వకార్ సలామ్‌ఖైల్ – అమ్ముడుపోలేదు
- దనీష్ మలేవార్ – ముంబై ఇండియన్స్ – రూ. 30 లక్షలు
- సల్మాన్ నిజార్ – అమ్ముడుపోలేదు
- అక్షత్ రఘువంశీ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 2.2 కోట్లు
- సాత్విక్ దేస్వాక్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 30 లక్షలు
- అమన్ ఖాన్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 40 లక్షలు
- విక్కీ ఓస్త్వాల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 30 లక్షలు
- మయాంక్ రావత్ – ముంబై ఇండియన్స్ – రూ. 30 లక్షలు
- మంగేష్ యాదవ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 5.20 కోట్లు
- సలిల్ అరోరా – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 1.40 కోట్లు
- రవి సింగ్ – రాజస్థాన్ రాయల్స్ – రూ. 95 లక్షలు
- కేఎం ఆసిఫ్ – అమ్ముడుపోలేదు
- సాకిబ్ హుస్సేన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 30 లక్షలు
- మహ్మద్ ఇజార్ – ముంబై ఇండియన్స్ – రూ. 30 లక్షలు
- ఓంకార్ తర్మలే – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 30 లక్షలు
- మురుగన్ అశ్విన్ – అమ్ముడుపోలేదు
- తేజస్ బరోకే – అమ్ముడుపోలేదు
- కేసీ కరియప్ప – అమ్ముడుపోలేదు
- మోహిత్ రాతీ – అమ్ముడుపోలేదు
- కూపర్ కనోలీ – పంజాబ్ కింగ్స్ – రూ. 3 కోట్లు
- డాన్ లారెన్స్ – అమ్ముడుపోలేదు
- తస్కిన్ అహ్మద్ – అమ్ముడుపోలేదు
- రిచర్డ్ గ్లీసన్ – అమ్ముడుపోలేదు
- అల్జారీ జోసెఫ్ – అమ్ముడుపోలేదు
- రిలే మెరెడిత్ – అమ్ముడుపోలేదు
- జై రిచర్డ్‌సన్ – అమ్ముడుపోలేదు
- ధీరజ్ కుమార్ – అమ్ముడుపోలేదు
- తనయ్ త్యాగరాజన్ – అమ్ముడుపోలేదు
- కానర్ ఈ. – అమ్ముడుపోలేదు
- ఇర్ఫాన్ ఉమైర్ – అమ్ముడుపోలేదు
- చింతల్ గాంధీ – అమ్ముడుపోలేదు
- అమిత్ కుమార్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 30 లక్షలు
- విశాల్ నిషాద్ – పంజాబ్ కింగ్స్ – రూ. 30 లక్షలు
- నాథన్ స్మిత్ – అమ్ముడుపోలేదు
- డేనియల్ లేట్‌గాన్ – అమ్ముడుపోలేదు
- అథర్వ అంకోలేకర్ – ముంబై ఇండియన్స్ – రూ. 30 లక్షలు
- కరణ్ లాల్ – అమ్ముడుపోలేదు
- ఉత్కర్ష్ సింగ్ – అమ్ముడుపోలేదు
- ఆయుష్ వర్తక్ – అమ్ముడుపోలేదు
- ఆయుష్ హింగే – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 30 లక్షలు
- జిక్కు బ్రైట్ – అమ్ముడుపోలేదు
- ఇజాజ్ సవారియా – అమ్ముడుపోలేదు
- క్రెయిన్స్ ఫులెత్రా – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 30 లక్షలు
- సార్థక్ రంజన్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 30 లక్షలు
- దక్ష్ కమ్రా – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 30 లక్షలు
- మణిశంకర్ మురసింగ్ – అమ్ముడుపోలేదు
- అమన్ రావ్ – రాజస్థాన్ రాయల్స్ – రూ. 30 లక్షలు
- మనన్ వోహ్రా – అమ్ముడుపోలేదు
- ప్రవీణ్ దూబే – పంజాబ్ కింగ్స్ – రూ. 30 లక్షలు
- సాహిల్ పరాఖ్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 30 లక్షలు
- మయాంక్ దాగర్ – అమ్ముడుపోలేదు
- మనీ గ్రేవాల్ – అమ్ముడుపోలేదు
- మాక్‌నీల్ నొరోన్హా – అమ్ముడుపోలేదు
- సిద్ధార్థ్ యాదవ్ – అమ్ముడుపోలేదు
- బ్రిజేష్ శర్మ – రాజస్థాన్ రాయల్స్ – రూ. 30 లక్షలు
- రితిక్ టాడా – అమ్ముడుపోలేదు
- జాక్ ఎడ్వర్డ్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 3 కోట్లు
- చామా మిలింద్ – అమ్ముడుపోలేదు
- స్వాతిక్ చికారా – అమ్ముడుపోలేదు
- జకరీ ఫౌక్స్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 75 లక్షలు
- పృథ్వీ రాజ్ – గుజరాత్ టైటాన్స్ – రూ. 30 లక్షలు
- విలియం సదర్లాండ్ – అమ్ముడుపోలేదు
- ల్యూక్ వుడ్ – గుజరాత్ టైటాన్స్ – రూ. 75 లక్షలు
- ఆర్ఎస్ అంబరీష్ – అమ్ముడుపోలేదు
- విహాన్ మల్హోత్రా – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 30 లక్షలు
- కనిష్ చౌహాన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 30 లక్షలు

