HomeEditor's ChoiceGeneral

ప్రధానిగా చంద్రబాబుకు అవకాశం – రాయిటర్స్ విశ్లేషణ

ప్రధానిగా చంద్రబాబుకు అవకాశం – రాయిటర్స్ విశ్లేషణ

2029 సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని అయ్యే అవకాశం ఉందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తన విశ్లేషణ లో పేర్కొంది. రాయిటర్స్ బ్రేకింగ

మోడీ సభలో సమోసాల కోసం తన్నుకున్న బీజేపీ కార్యకర్తలు
మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం… కేటీఆర్
ఢిల్లీలో ప్రధాని మోడీ క్రిస్మస్ ప్రార్థనలు

2029 సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని అయ్యే అవకాశం ఉందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తన విశ్లేషణ లో పేర్కొంది. రాయిటర్స్ బ్రేకింగ్‌వ్యూస్ తమ 2026 ప్రిడిక్షన్స్‌లో “BV Predicts: After Modi” అనే వీడియోలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలువ టర్మ్ ప్రధాని కాబోరని తేల్చి చెప్పింది. దానికి ఆయన వయసు ప్రధాన కారణమని పేర్కొంది.

ఈ విశ్లేషణలో చంద్రబాబు నాయుడును కూడా ఒక సంభావ్య అభ్యర్థిగా పేర్కొన్నారు. ఈ విశ్లేషణ ప్రకారం, మోదీ తర్వాత భారత రాజకీయాల్లో శక్తివంతమైన నాయకులుగా ఐదుగురిని గుర్తించారు:

అమిత్ షా: హోమ్ మినిస్టర్, మోదీకి ప్రీతి పాత్రుడు, పార్టీలో ప్రభావం చూపే అవకాశం ఉంది.

దేవేంద్ర ఫడ్నవిస్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకుడు, జాతీయ స్థాయికి ఎదిగే సామర్థ్యం.

ఎన్. చంద్రబాబు నాయుడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీకి బైటి వ్యక్తి కానీ ఆ పార్టీకి నమ్మకమైన మిత్రుడు. అతని కుమారుడు నారా లోకేష్ కు కూడా అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. టీడీపీ గూగుల్‌తో 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను పెంచుకున్నారని రాయిటర్స్ విశ్లేషణ. నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో దూకుడుగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు, ఇది అతని జాతీయ స్థాయి ప్రభావాన్ని పెంచుతుంది. 2029 ఎన్నికల తర్వాత, మోదీ తర్వాతి కాలంలో కూటమి రాజకీయాల్లో నాయుడు కీలక పాత్ర పోషించవచ్చు, ముఖ్యంగా ఎన్డీఏలో బలమైన మిత్రునిగా ఉన్నాడు.

రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నాయకుడు, విపక్షం గెలిస్తే సంభావ్య అభ్యర్థి.
ప్రియాంక గాంధీ: కాంగ్రెస్ నాయకురాలు, విపక్షాల్లో డార్క్ హార్స్‌గా (ఊహించని అభ్యర్థి) పరిగణించబడుతుంది.

ఈ విషయంపై 2026 నుంచే చర్చలు ప్రారంభమవుతాయని ఈ విశ్లేషణ సూచిస్తుంది. చంద్రబాబు నాయుడు విషయంలో, అతని రీజనల్ బలం, మోదీతో అతనికున్న మిత్రత్వం, ఆర్థిక అభివృద్ధి ద్వారా జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉందని హైలైట్ చేశారు.