HomeEditor's ChoiceTelangana

మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం… కేటీఆర్

మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం… కేటీఆర్

తెలంగాణ ఏర్పాటునే అవమానించిన, వ్యతిరేకించిన ప్రధాని Prime Minister నరేంద్ర మోడీ Narendra Modi రాష్ట్ర పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని తెలంగాణ మంత్ర

బీజేపీ, బీఆరెస్ మధ్య పోరాట‍ం నిజమా? లేక ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం నిజమా ?
తాను బీఆరెస్ లోనే ఉన్నానన్న కడియం- దిష్టిబొమ్మలను వేళాడదీస్తానని రాజయ్య హెచ్చరిక‌
29న అసెంబ్లీకి.. కేసీఆర్ వస్తున్నాడోచ్…!

తెలంగాణ ఏర్పాటునే అవమానించిన, వ్యతిరేకించిన ప్రధాని Prime Minister నరేంద్ర మోడీ Narendra Modi రాష్ట్ర పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని తెలంగాణ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

రేపు మోడీ తెలంగాణకు వస్తున్నారు. ఆయన పర్యటనపై కేటీఆర్ KTR నిప్పులు చెరిగారు. గుజరాత్ లోని కోచ్ ఫ్యాక్టరీకి రూ. 20 వేల కోట్లు ఇచ్చిన మోడీ తెలంగాణకు కేవలం రూ. 521 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

తెలంగాణపై Telangana వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న మోడీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్.

కేంద్ర బీజేపీ సర్కార్ విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేటీఆర్ KTR విమర్శించారు. తెలంగాణపై మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.

పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గాంధీభవన్ లో గాడ్సే దూరాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆరెస్సెస్ వ్యక్తి రేవంత్ అని అన్నారు. భూదందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయన్నారు. ఆ పార్టీల మోసాలు ప్రజలకు తెలుసని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ పోరాటాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.